వైసీపీలోకి మంత్రి సోదరుడు?

Share Icons:

విశాఖపట్నం, 21 జనవరి:

ఇటీవలే అధినేత వైఎస్ జగన్ పాదయాత్రతో మంచి మైలేజ్ తెచ్చుకున్న వైసీపీ పార్టీ ప్రస్తుతం ఇతర పార్టీల నేతల చేరికలతో ఇంకా బలపడుతూ ముందుకు సాగుతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో  అధికార టీడీపీ మీద అసంతృప్తితో ఉన్న నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే నర్సీపట్నం వైసీపీ నాయకులు.. ఈమధ్య తరచుగా సన్యాసి పాత్రుడిని కలిసి తమ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారటా.

అయితే సన్నాసి నాయుడుకి తన అన్నఅయ్యన్న కుటుంబతో ఉన్న విభేదాలు కారణంతో ఆయన వైసీపీలో చేరటానికి సిద్ధంగానే ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయనకు నర్సీపట్నం మున్సిపాలిటీలో మంచి పట్టు ఉండటంతో సన్యాసి పాత్రుడు కనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఆ నియోజకవర్గం కచ్చితంగా తమకే దక్కుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

అంతేకాదు.. ఇక్క టీడీపీ ఓట్లు కూడా చీలిపోతాయి. దీంతో.. నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో తెచ్చుకోవచ్చని అనుకుంటున్నారు. ఇక వైసీపీ ఆఫర్‌కి సన్యాసిపాత్రుడు కూడా సముఖంగానే ఉన్నారని సమాచారం. కాకపోతే తనకు టికెట్ కేటాయిస్తాను అంటేనే పార్టీలో చేరతాను అని షరతు పెట్టారట. ప్రస్తుతానికి ఈ విషయంపై సన్యాసి పాత్రుడితో వైసీపీ నేతలు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.

మామాట: మరి దీనిపై మంత్రి అయ్యన్న ఎలా స్పందిస్తారో..

 

Leave a Reply