చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వనంటున్న ఏపీ మంత్రి…

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

విశాఖపట్నం: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వద్దనుకున్న తెలుగుదేశం పార్టీకి, దాని అధినేతగా చెప్పుకునే చంద్రబాబునాయుడు చేసే విమర్శలకు తాను కౌంటర్ ఇచ్చేదేంటని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విశాఖపట్నం మురళీనగర్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలోని ప్రజలు, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ సంక్రాంతి పర్వదినాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంటే, చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు.

టీడీపీకి, చంద్రబాబుకు భవిష్యత్తే లేదని వ్యాఖ్యానించిన అవంతి శ్రీనివాస్, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను తగులబెట్టే ముందు ఆయన నారాయణ కమిటీ నివేదికను తగులబెట్టాల్సిందని సలహా ఇచ్చారు. ఆ తరువాత మిగతా నివేదికల గురించి ఆలోచిస్తే బాగుండేదని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు, రాష్ట్రానికీ ఏమీ చేయని చంద్రబాబు, తన ఆస్తులను, తన బినామీల ఆస్తులను మాత్రం పెంచుకున్నారని మండిపడ్డారు.

అటు ఈరోజు నగరిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో.. రాజధానిని ఎందుకు పర్మినెంట్ చేయలేదని ప్రశ్నించారు. కనీసం ఎక్కడా కూడా పర్మింనెట్ స్ట్రక్చర్‌ను నిర్మించలేదని.. అమరావతిని రాజధానిగా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చిన ఆయన..రాజధాని కట్టకుండా ఏం చేశారన్నారు. అసలు ఆ డబ్బంతా ఏం చేశారన్నది ఎవరికీ తెలియని పెద్ద ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. సీఎంగా ఉన్న సమయంలో.. రైతులు పండించుకునే మూడు పంట పొలాలను లాక్కొని.. ఇవ్వని వాళ్ల పొలాలను తగలబెట్టేసి… అక్కడ ఉన్న రైతులను నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో.. ఏం చేయకుండా ఇవాళ జోలె పట్టుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెప్తూ… డ్రామాలు చేస్తున్నారని… చంద్రబాబు నటనలను ఎవ్వరూ నమ్మరన్నారు. చంద్రబాబు అంత పెద్ద నటుడు ఎవ్వరూ ఉండరని గతంలో ఎన్టీఆరే చెప్పారని రోజా సంచలన కామెంట్స్ చేశారు.

 

Leave a Reply