టీడీపీని వీడే ప్రసక్తే లేదు…

Share Icons:

విజయవాడ, 11 జనవరి:

ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ…టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అసలు పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇక జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి  టీడీపీ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తానని ఆమె చెప్పారు. ఆ ఎన్నికల్లో తన విజయాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని మంత్రి తెలిపారు. అయితే ఆళ్లగడ్డలో తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నందునే గన్‌మెన్లను దూరంగా పెట్టాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. దీంతో తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నందున పోలీసులపై పోరాటం చేస్తున్నట్టు ఆమె తెలిపారు.

కాగా, ఇటీవల అఖిల టీడీపీపై అసంతృప్తిగా ఉందని, జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఆమె ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.

మామాట: మొత్తానికి క్లారిటీ ఇచ్చారు…

Leave a Reply