స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Share Icons:

అమరావతి: ఏపీలోని స్థానిక సంస్థల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. 660 జెడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండో దశలో మున్సిపాలిటీలకు, మూడో దశలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన అన్నారు.

ఈనెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ గడువుందన్నారు. ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగగా… లెక్కింపు 24న ఉంటుందన్నారు. ఈనెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండగా.. 27న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. అదేవిధంగా ఈనెల 27, 29 తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని.. పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు ఉంటాయన్నారు.

ఇక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు ఎన్నికల కమిషనర్. అవసరమైతే గ్రామ సచివాలయాల ద్వారా ఎంపికైన సిబ్బందిని కూడా వినియోగించుకుంటామని వెల్లడించారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక పదవ తరగతి పరీక్షలు వాయిదా విషయం తామేమీ అడగలేదని చెప్పిన ఎన్నికల కమిషనర్… చీఫ్ సెక్రటరీ నీలం సహాని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు చెప్పాకే షెడ్యూల్ పై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

టోటల్ షెడ్యూల్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌
మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌
మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌
మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
మార్చి 29: ఓట్ల లెక్కింపు

Leave a Reply