TRENDING NOW

భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం

భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం

న్యూ ఢిల్లీ, మే 30:

అమరావతిని రాజధానిచేసి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపిస్తానంటున్న సీఎం చంద్రబాబుకి రాష్ట్రపతి నుండి తీపి కబురందింది. భూసేకరణ చట్టం సవరణలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టింది, ఈ బిల్లుకు మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

భూసమీకరణలో భూమిని ఇవ్వడానికి ఒప్పుకోని వారి నుంచి భూసేకరణ చేయడం కోసం ‘2013 భూ సేకరణ చట్టం’కు సవరణ చేస్తూ 2017 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో బిల్లునుప్రవేశపెట్టింది.

అంతకు ముందు గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు సవరించిన విధంగానే ముఖ్యమైన సామాజిక ప్రభావ సర్వే, యజమానుల అంగీకారం, నష్టపరిహారం, పునర్నిర్మాణం వంటి నిబంధనలన్నిటినీ ససవరించి కొత్త చట్టానికి బిల్లును ప్రవేశపెట్టింది.

గతసంవత్సరం మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుకు మరిన్ని మార్పులుచేర్పులు చేస్తూ నవంబర్ చివర్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో కొత్త బిల్లును ఆమోదించింది. దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.

మంగళవారం బిల్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం పొందింది కాబట్టి ఇక ఇది చట్టంగా మారనుంది. ఈ సవరణ చట్టం అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కూడా సేకరించే అధికారం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది.

కొత్తగా చేసిన సవరణ ప్రకారం దేశ రక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు, గృహనిర్మాణం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం,మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మొదలైన వాటికోసం భూసేకరణ చేసే అధికారం ప్రభుత్వానికి కలుగుతుంది.

పండే భూములకు మినహాయింపు, భూ యజమానుల అంగీకారం, గ్రామసభల ఆమోదం, రెట్టింపు పరిహారం వంటి నిబంధనలు వర్తించవని సవరణ బిల్లులో పేర్కొన్నారు. అంటే ఈ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా అడ్డంకులు తొలగినట్లే.

ఇప్పటికే భూములను సేకరించిన ప్రభుత్వం, ఈ చట్టంతో ఇక మిగిలిన భూములనూ సేకరించి నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలుగుదేశం మంత్రివర్గం పేర్కొంది.

మామాట: భూసేకరణ చట్టంతో తెలుగుదేశానికి తీపికబురు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: