అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసిన చినరాజప్ప

Share Icons:

పెద్దాపురం, 1 జనవరి:

మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయే ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్నీ పార్టీలు గెలుపు గుర్రాలపై కసరత్తు చేస్తున్నారు. అయిహే ఏ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసిన దాఖలాలు లేవు. కానీ ఏపీ హోం శాఖ మంత్రి డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాత్రం తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు.

హోంమంత్రి గురువు కంచి మహాసంస్థాన అధ్యక్షుడు చంద్రాభట్ల చింతామణిగణపతి శాస్త్రి చినరాజప్ప ఇంటి వద్ద ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం పెద్దాపురం పట్టణంలోని తూర్పుదిక్కుగా ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు హోం మంత్రి చినరాజప్ప. ఇక రాష్ట్రంలోనే ఎన్నికల ప్రచారావనికి శంఖారావం పూరించిన మెుట్టమెదటి వ్యక్తిగా హోంమంత్రి చినరాజప్ప నిలిచిపోయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏశక్తులు అడ్డుకోలేవన్నారు. మళ్లీ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మామాట: ప్రచారం సంగతి సరే….మరి గెలుపు సులువేనా…

Leave a Reply