స్థానిక పోరుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: వచ్చే నెల 15లోపు ఎన్నికలు…

bjp mp tg venkatesh new demand for two capitls in ap
Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. వచ్చే నెల 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 3వ తేదీ నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

అయితే 59.85 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ప్రక్రియకు ఆటంకం కలిగింది. సుప్రీంకోర్టు నియమాల ప్రకారం ఆయా సంస్థలకు సంబంధించి ఎన్నికలు రిజర్వేషన్ 50 శాతానికి మించొద్దు. కానీ జగన్ ప్రభుత్వం 59.85 రిజర్వేషన్లు ఖరారు చేయడంపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వచ్చింది. దీంతో వారు హైకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను అలకించింది.

స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు వాదనలు కూడా ధర్మాసనం అలకించింది. ప్రభుత్వ అఫిడవిట్‌కు హైకోర్టు ఆమోదం తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం జెడ్పీటీసీ ఎన్నికలను రెండువిడతల్లో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన నోటిపికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 10వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఏపీలో 13 జిల్లాలకు గానూ పదమూడు జెడ్పీ పీఠాలు ఉన్నాయి.

 

Leave a Reply