ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..

ap cm jagan sweet warning to ministers
Share Icons:

అమరావతి: గత ఏడాది ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఏపీలో ఎలాంటి ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో…ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వార్డుల వారిగా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. తెలంగాణ తరహాలోనే బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

ఇదిలా ఉంటే గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 175 స్థానాల్లో 151 వైసీపీ గెలవగా… టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. జనసేన ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గాను వైసీపీ 22 చోట్ల విజయం సాధించింది. కేవలం మూడింట మాత్రమే తెలుగు దేశం పార్టీ గెలిచింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు చంద్రబాబు. అమరావతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని యోచిస్తున్నారు. ఇక వైసీపీ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మరోసారి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల జతకట్టిన బీజేపీ-జనసేన సైతం మున్సిపల్ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

 

Leave a Reply