సాయంత్రం 6 దాటితే మద్యం బంద్: అక్టోబర్ నుంచి అమలు చేయనున్న జగన్ ప్రభుత్వం

ap-govt-sensational-proposals-on-liquor-sales
Share Icons:

అమరావతి:

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… మద్యపాన నిషేధంలో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకొనున్నారు. ఇప్పటికే మద్యపాన నిషేధానికి సంబంధించి విధివిధానాలని ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్న ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దశల వారీగా మద్యాన్ని నిషేధించాలని చూస్తున్న జగన్…. ఏపీలో మ‌ద్యం వినియోగాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయమని అధికారులకు సూచించారు.

 

అందులో భాగంగా ఇక నుండి ఏపీలో మ‌ద్యం విక్ర‌యాలు ప్ర‌స్తుతం ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ నుండి అమ‌ల్లోకి వ‌చ్చే కొత్త ఎక్సైజ్ పాల‌సీలో ఈ ప్ర‌తిపాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. అయితే ఇప్పటివరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం అమ్మకాలు జరిగేవి. ఇక అక్టోబర్ నుంచి సాయంత్రం 6 గంటల వరకే జరగనున్నాయి.

 

ఇక రాష్ట్రంలో లభిస్తున్న కొన్ని మద్యం బ్రాండ్లని కూడా నిషేధించాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం 340 రకాల బ్రాండ్లు ఏపీలోకి వస్తున్నాయి. అందులో విస్కీ, బ్రాందీ, రమ్ము, వోడ్కా, బ్రీజర్‌, జిన్ను లాంటి లిక్కర్‌ బ్రాండ్లే 270 వరకూ ఉన్నాయి. మిగతావి బీరు బ్రాండ్లు. అయితే పేరుకు ఇన్ని ఉన్నా ఎక్కువ డిమాండ్‌ ఉండేది అందులో సగం కూడా ఉండవు. దీంతో వీటిల్లో కొన్నిటిని తగ్గించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Leave a Reply