టీడీపీకి మరో షాక్: గంటా గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం..

Share Icons:

విశాఖపట్నం:

తెలుగుదేశం పార్టీకి వైసీపీ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తుంది. ఇప్పటికే అక్రమ కట్టడమని ప్రజావేదికని కూల్చేసిన వైసీపీ…చంద్రబాబు నివాసముంటున్న ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు.

అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు.

ఈ క్రమంలోనే భీమిలీలోని టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆఫీసుకు జీవీఎంసీ నోటీసులు అందించింది. కుమార్తె సాయి పూజిత పేరుతో నిర్మించిన ఈ భవనం నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంది. 24 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే కూల్చేస్తామని జీవీఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.

Leave a Reply