పంచాయితీ, స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమైంది…

Share Icons:

అమరావతి: ఏపీలో 12వేల పైచిలుకు పంచాయితీల పదవీ కాలం 2018 ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే. అలాగే ఎంపిపి, జెడ్పీ, మున్సిపాల్టీలకు ఈ ఏడాది జూన్ తో పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో నిర్వహించకుంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ దక్కే అవకాశం ఉండదు. దీంతో కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నకలు నిర్వహించాలని నిర్ణయించింది.

అందుకు ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా పంచాయితీ రాజ్, మున్పిల్స్ శాఖలు వార్డుల విభజనతోపాటు బిసి కుల గణననను పూర్తి చేశాయి. సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితాకు అనుగుణంగా ఈ గణనను పూర్తి చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం కోర్టుకు సైతం మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పటంతో డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే సమీక్షించారు. దీంతో పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, బిసి జనాభా గణను పూర్తి చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్నిఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు గాలివాటం కాదని నిరూపించేలా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం సాధించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 59.85శాతం రిజర్వేషన్లతోనే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది.

అయితే ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైతే ఎన్నికలు డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశముంది. లేదా ప్రస్తుత పరిస్థితులు ప్రభుత్వానికి అంత అనుకూలంగా లేవు అనుకుంటే  మార్చిలో జరగుతాయా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే ఎప్పుడు జరిగిన పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక ఈ ఎన్నికలు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే ఫలితాలు కూడా వస్తాయి. చూడాలి మరి ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.

 

Leave a Reply