మండలి రద్దు దిశగా వైసీపీ ప్రభుత్వం…అత్యవసర కేబినెట్ సమావేశం?

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: మూడు రాజధానుల బిల్లుని మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళుతుంది. శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం యోచన చేస్తుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మంత్రులకు అందుబాటులో ఉండాలని సీఎం కార్యలయం నుంచి ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది. మండలి రద్దుపై బిల్లు తయారు చేసి రేపు అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే అసెంబ్లీ కార్యదర్శకి కూడా లేఖ ఇచ్చేందుకు చూస్తున్నారు.

మూడు రాజధానుల బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత ఈ రోజు మండలిలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. గతంలో శాసనమండలి రద్దు ప్రతిపాదన పైన చర్చ సాగింది. అయితే, దాని పైన చర్చను నాడు పక్కన పెట్టారు. తిరిగి, ఈ రోజు శాసనసభా లాబీల్లో వైసీపీ నేతల మధ్య ఈ అంశం పైన సీరియస్ గా చర్చ సాగుతోంది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన రెండు బిల్లును మండలి తిరస్కరించింది. ఈ రోజు అవే బిల్లుల పైన శాసనసభ లో తిరిగి ప్రవేశ పెట్టారు. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం లో జరుగున్న శాసనమండలి రద్దు ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు.

అటు మండలిలో బిల్లులను ఆమోదించుకోలేకనే ప్రభుత్వం సభ్యులను బెదిరించే ధోరణిలో ఈ ప్రచారం తీసుకొచ్చిందంటూ టీడీపీ సభ్యులు కౌంటర్ ఇస్తున్నారు. మండలి రద్దు చేయటం అంత సులువైన అంశం కాదని..దీనికి పార్లమెంట్ ఆమోదం కావాలని..దాదాపు సంవత్సర కాలం సమయం పడుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల వ్యాఖ్యానించారు. అదే సమయంలో మండలి రద్దు చేస్తామంటే తాము భయపడేది లేదని మాజీ మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. ఇక, మరో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సైతం దీని మీద స్పందించారు. మండలి రద్దు చేస్తే వైసీపీలో చీలక వస్తుందని జోస్యం చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు ఆమోదించుకొనేందుకే..వ్యూహాత్మకంగా ఈ ప్రచారం తెర మీదకు తీసుకొచ్చిందని టీడీపీ నేతల వాదన. మరి చూడాలి రేపు మండలిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.

 

Leave a Reply