త్వరలో 11,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం…

cm jagan good news for home guards...increase their salaries
Share Icons:

అమరావతి: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు వరుసగా ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, సచివాలయాల పేరిట లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే  ఏపీలోని నిరుద్యోగులు త్వరలో మరో శుభవార్త విననున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పోలీసు నియామక మండలి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 11,500 పైగా పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో 340 సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) పోస్టులు ఉండగా.. 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.

వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ వెలువడనున్న నేపథ్యంలో పోలీసు శాఖలో ఖాళీల వివరాలను పోలీసు నియామక మండలి ప్రభుత్వానికి అందజేసింది. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం 3 వేలకు పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియ పూర్తి కావడంతో.. మరోసారి ఖాళీల భర్తీపై పోలీసు నియామక మండలి దృష్టి సారించింది.

అటు గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి రెండో విడత దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 15 నుంచి అభ్యర్థులకు దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు. నవంబరు 16 నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను నవంబరు 22న ప్రకటిస్తారు. అనంతరం వీరికి నియామక పత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు పొందినవారు డిసెంబరు 1 నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఏపీలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను; 19,170 వార్డువాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 28,844 గ్రామ/ వార్డులను ప్రభుత్వం భర్తీచేయనుంది.

తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలు…

తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు త్వరలోనే దాదాపు 3 వేల టీచింగ్, నాన్-నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. గురుకులాల్లో దాదాపు 2200 పోస్టులతో పాటు వివిధ సొసైటీల్లో ప్రకటనలు వెలువరించని పీఈటీ, పీజీటీ హిందీ, ఫిజికల్‌ డైరెక్టర్లు, ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్ పోస్టుల సంఖ్య 600కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దాదాపు 3 వేల వరకు పోస్టులు ఉన్నాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనుంది.

 

 

Leave a Reply