రాజధాని తరలింపు: సి‌ఆర్‌డి‌ఏ రద్దు? మండలిలో బిల్లు ఆమోదం పొందుతుందా?

ap cm jagan mohan reddy comments on pawan kalyan
Share Icons:

అమరావతి: మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఈ నెల 20న ఉదయం కేబినెట్ సమావేశం..అందులోనే హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర..ఆ వెంటనే అసెంబ్లీలో చర్చకు వీలుగా ప్రభుత్వం తొలుత కార్యాచరణ సిద్దం చేసింది. అయితే, శుక్రవారం హైపవర్ కమిటీ సభ్యులు సీఎం ను కలిసారు. నివేదిక తుది రూపుపైన చర్చించారు. ఆ వెంటనే కేబినెట్ ను ఈ రోజు మద్యాహ్నం నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులకు..అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ, రాత్రికి మరోసారి ఆలోచన మారింది. శనివారం కాదని..ముందుగా నిర్ణయించిన ప్రకారమే సోమవారం ఉదయమే మంత్రివర్గ సమావేశం ఉంటుందని రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ పంపారు.

తాజా సమాచారం ప్రకారం… సోమవారం ఉదయం 9 గంటలకు కేబినెట్‌ భేటీ జరుగుతుం ది. ఆ తర్వాత.. 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. అయితే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించడం కోసం అమరావతిలోని సీఆర్డీయేను రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించినా… మండలిలో మెజార్టీ ఉన్న టీడీపీ దీన్ని అడ్డుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మండలిలో ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులను తిప్పి పంపేలా టీడీపీ వ్యవహరించింది.

అయితే ఇప్పుడు సీఆర్డీఏ బిల్లును సభలో ప్రవేశ పెట్టి ఆమోదించే అంశం పైన న్యాయ పరంగా చర్చలు సాగుతున్నాయి. ఇది ద్రవ్య బిల్లు కిందకు వస్తుందా..లేక సాధారణ బిల్లు అనే అంశం పైనా చర్చ సాగింది. ద్రవ్య బిల్లు అయితే కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశ పెట్టే ముందే గవర్నర్ ఆమోదం తీసుకోవాలి. కానీ, చర్చల తరువాత ఇది ద్రవ్య బిల్లు కాదని.. నేరుగా సోమవారం కేబినెట్‌లో ఆమోదించి, వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చుననే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో..సోమవారమే కేబినెట్ లో దీనికి ఆమోద ముద్ర వేయాలని నిర్ణయించారు. ఇక్కడ ద్రవ్యబిల్లు అయితే టీడీపీ అడ్డుకునే పరిస్తితి ఉండదు. కానీ ఇది సాధారణ బిల్లుగా వస్తున్న తరుణంలో శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటం వల్ల…బిల్లు ఎలా పాస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 

Leave a Reply