జగన్ మరో సంచలన నిర్ణయం: చంద్రబాబు టార్గెట్ గా కొత్త వ్యూహం….

ap cm jagan recommended cbi inquiry on tdp former mla and chandrababu ready to help tdp leader
Share Icons:

అమరావతి: అధికార పీఠం చేజిక్కించుకున్న దగ్గర నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 గ్రామ పంచాయితీలని మున్సిపాలిటీలుగా మారుస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కూడా ఉంది. కుప్పంలో పట్టు సాధించడానికి….ఇప్పటివరకు గ్రామ పంచాయితీగా ఉన్న కుప్పంని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నారు.

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటాడానికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 1989 ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ప్రతిసారి భారీ మెజారిటీతో గెలిచిఏ చంద్రబాబు…మొన్న ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో గెలిచారు. అంటే 2014 ఎన్నికలతో పోలిస్తే 17 వేల మెజారిటీ తక్కువ. 2014లో 47 వేల మెజారిటీవచ్చింది. ఇక త్వరలో మున్సిపాలిటీ ఎన్నికల నుంచే బాబుకు చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్ కుప్పం ని మున్సిపాలిటీగా మార్చారు.

కుప్పంకు అధిక నిధులు మంజూరు చేసి చంద్రబాబు చేయని అభివృద్ధిని చేసి చూపించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన మున్సిపాలిటీలతో పోల్చుకుంటే.. అధిక నిధులను గ్రాంటుగా మంజూరు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక కుప్పంతో కలుపుకుని మొత్తం 50 కొత్త మున్సిపాలిటీలని ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాల వారీగా కొత్త మున్సిపాలిటీ వివరాలు…

విశాఖపట్నం జిల్లా: ఆనందపురం, నక్కపల్లి, పాయకరావు పేట. విజయనగరం జిల్లా: కురుపాం, చీపురుపల్లి-గరివిడి (ఉమ్మడిగా), శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, రణస్థలం. కడప జిల్లా: రైల్వే కోడూరు, నందలూరు, వేంపల్లి. తూర్పు గోదావరి జిల్లా: కొత్తపేట, రావులపాలెం, అనపర్తి, జగ్గంపేట. పశ్చిమ గోదావరి జిల్లా: ఆకివీడు, చింతలపూడి, అత్తిలి. అనంతపురం జిల్లా: పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల.

నెల్లూరు జిల్లా: బుచ్చిరెడ్డి పాలెం-వవ్వూరు (ఉమ్మడిగా), కోట-వాకాడు-గూడలి, ఆలూరు, పొదలకూరు, ముత్తుకూరు, రాపూరు, తడ-తడ కండ్రిగ (ఉమ్మడిగా) మున్సిపాలిటీలుగా ప్రకటించారు. గుంటూరు జిల్లా: దాచేపల్లి, నడికుడిలను ఉమ్మడిగా మున్సిపాలిటీగా ప్రకటించారు. గురజాల, నిజాంపట్నంలను ఈ జాబితాలో చేర్చారు. ప్రకాశం జిల్లా: దర్శి, పొదిలి, మార్టూరు, టంగుటూరు, సింగరాయకొండ, వేటపాలెం. కృష్ణా జిల్లా: అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట. చిత్తూరు జిల్లా: కుప్పం, కర్నూలు జిల్లా: బేగంచర్ల, కోయిలకుంట్ల, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, పాణ్యం.

Leave a Reply