ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు….500 యూనిట్లు దాటితే…

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: ఇటీవలే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వం…తాజాగా విద్యుత్ చార్జీలని కూడా పెంచింది. 500 యూనిట్లు పైబడిన వారికి యూనిట్‌కు 90 పైసలు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 500 యూనిట్లు పైబడి వాడిన వారికి రూ.9.05 నుంచి రూ.9.95 గా టారిఫ్ నిర్ణయించారు.

500 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా ప్రభుత్వం అందివ్వనుంది. 1707.07 కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది.ప్రతి నెలకు ఆనెల లోని విద్యుత్ వినియోగం పైనే వర్గీకరణకు ఆమోదం ఇచ్చింది. 500 యూనిట్లకు పైబడి విద్యుత్ గృహ వినియోగదారులకు యూనిట్ ధర పెంచింది. యూనిట్ ధర 9.05రూపాయిల నుంచి 9.95 కు పెంపునకు నిర్ణయం తీసుకుంది.

ఇక ఏపీ వ్యవసాయ వినియోగదారులకు(ఆదాయపన్ను చెల్లించని వ్యవసాయదారులు, బెల్లం రైతులు, గ్రామీణ నర్సరీలకు) రూ.8,353.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించుటకు అంగీకారం తెలిపారు. ఆంద్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ , దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.14,349.07 ఆదాయం అవసరం అవుతుందని అంచనా వేశారు.

వినియోగదారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,893.48 కోట్లు ఆర్టికభారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థలు నికర లోటు రూ.10,060.63 కోట్లుగా నిర్దారించారు.మొత్తం 1.45 కోట్ల గృహ వినియోగదారులలో 1.35 లక్షల వినియోగదారులకు పెంచిన టారిఫ్ వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ,కార్పొరేట్ సంస్థలపై ఛార్జీలు భారం పడనుంది. పెంచిన విద్యుత్ చార్జీలు రూ.1300 కోట్లు భారం పడుతుంది.

అటు ఎల్టీ కేటగిరీలో ఉన్న లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ ఆసపత్రులు,ప్రభుత్వ విద్యాసంస్థలకు హెచ్‌టీ సాధారణ కేటగిరీధోబీ ఘాట్ లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చయనుంది. ప్రజా ప్రయోజనాల కోసం రైల్వే టారిఫ్ యూనిట్ 6.50రూపాయిల 5.50కి తగ్గించారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు యూనిట్ 12.20 రూపాయిల నుంచి 6.70కి తగ్గించారు.

 

Leave a Reply