పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించిన ఏపీ ప్రభుత్వం…

Share Icons:

అమరావతి, 10 సెప్టెంబర్:

ప్రతి సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ వాహనదారులకి తీపి కబురు చెప్పారు ఏపీ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు.

సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం పెట్రోల్, డీజిల్ పై రూ.2 మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ధరలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్టు తెలిపారు.

సోమవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ ప్రతిపక్షాలు భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదే రోజు ఏపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈవిధంగా వ్యాట్ తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,120 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని, అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు కోరారు.

మామాట: మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి

 

Leave a Reply