రోజాకు కీలక పదవి అప్పగించిన ఏపీ ప్రభుత్వం…

ap government gave apiic chairperson to roja
Share Icons:

అమరావతి:

 

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజాకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా రోజాను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

అయితే కేబినేట్‌లో తనకు చోటు దక్కకపోవడంతో ఆమె కినుక వహించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఈ 45 రోజుల్లో ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌భుత్వం పైన విమ‌ర్శ‌లు చేస్తున్నా..రోజా పెద్ద‌గా రియాక్ట్ అవ్వ‌లేదు.

 

కానీ పలు సమీకరణల కారణంగా మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నానని కీలక పదవిని అప్పగిస్తామని సీఎం జగన్‌ ఆమెకు హామీ ఇచ్చారు ఆ మేరకు ఆమెను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) స్పెషల్‌ ఆఫీసర్‌గా ఏవీ ధర్మారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply