హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ భవనాలు తెలంగాణకు అప్పగింత

Share Icons:

హైదరాబాద్, జూన్ 03,

ఏపీ పాలన అంతా అమరావతి నుంచే నడుస్తుండడంతో హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వానికి చెందిన పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలాంటివాటిలో ఒక భవనాన్ని ఏపీ పోలీస్ శాఖకు, మరో భవనాన్ని ఇతర కార్యాలయాలకు కేటాయించి, మిగిలిన అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ పలుమార్లు గవర్నర్ వద్ద ప్రస్తావించడమే కాకుండా, తెలంగాణ క్యాబినెట్ కూడా విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలను సమంగా పంచారు. కానీ, ఏపీ ప్రభుత్వం వాటిని వాడుకోవడంలేదు.

అయినప్పటికీ వాటికి కరెంటు బిల్లులు, ఇతర నిర్వహణ చార్జీలన్నీ ఏపీ ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తాజా ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

మామాట- గత ప్రభుత్వం ఎందుకు చేయలేదో…

Leave a Reply