నిరుద్యోగులకు శుభవార్త: త్వరలో గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీ

ys-jagan-laid-foundation-stone-steel-plant-kadapa district
Share Icons:

అమరావతి: ఏపీ నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే లక్షకు పైగా గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, నాడు– నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ అంశాలపై సీఎం జగన్ సమీక్ష చేశారు.

ఇక కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు నిర్మించాలి. అందులో మరో 3000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలు భర్తీ చేయాలి’ సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. తర్వాత మినీ గోడౌన్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఫిబ్రవరి నుంచి ఇంటివద్దకే పెన్షన్లు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరవేయాలన్నారు. పెన్షన్లకోసం ఎదురుచూపులు, వేచి చూసే పరిస్థితి లేకుండా చేయడానికే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ తుది దశలో ఉందని… ఇలాంటి సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు… కేసును ఈ నెల 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణ ముగిసేవరకు తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయొద్దని సిట్(ప్రత్యేక దర్యాప్తు)‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకా భార్య వేసిన అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా అనేకమందిని విచారిస్తున్న సిట్… ఇటీవల మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని సైతం విచారించింది. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా సిట్ ప్రశ్నించింది.

 

Leave a Reply