మళ్ళీ చంద్రబాబు ఫైర్: అందరి జాతకాలు నా దగ్గరున్నాయ్…

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

విశాఖపట్నం: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ పోలీసులపై ధ్వజమెత్తారు.

పోలీసులు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును తీసుకోరని, అదే వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే రెడ్‌కార్పెట్‌ పరిచి మరీ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీ ప్రభుత్వం నడుస్తోందని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు కూడా ఇది నేరస్తుల ప్రభుత్వమని రుజువు చేశారన్నారు. సీఎం జగన్ ఓ నేరస్తుడు, ఆ నేరస్తుడు చెబితే పోలీసులు రెచ్చిపోతారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ భయపడే మనస్తత్వం తనది కాదన్నారు. ఓడిపోయామని బాధపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు.

ఇక, ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మాత్రం ఆలోచన, చలనశీలత లేదన్నారు. హుద్‌హుద్‌, తిత్లీ వంటి పెను విపత్తుల సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా తాను, పార్టీ నాయకులు బాధితుల మధ్య ఉండి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల గోదావరి, కృష్ణా నదులకు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అమెరికా, జెరూసలేం పర్యటనల్లో మునిగి తేలారని విమర్శించారు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అయితే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్నారని, అలాంటప్పుడు ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల కోసం ఎంతవరకైనా వెళ్తానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తే మరింత రెచ్చిపోతారని వ్యాఖ్యనించారు. ఓడిపోయామని బాధపడాల్సిన పనిలేదని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల కోసం నాలుగు నెలలుగా పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానన్నారు.

 

Leave a Reply