రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో వడగాల్పులు!

Share Icons:

అమరావతి, మే 22,

ఏపీలో మళ్లీ వడగాల్పులు పెరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు తీవ్రస్థాయిలో వడగాల్పులు వీయనున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండనున్నట్టు ఆర్టీజీఎస్ పేర్కొంది.

రాష్ట్రంలో పలు చోట్ల 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నట్లు తెలిపింది. మరోపక్క, ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ తెలిపింది.

మామాట- ఈ వారం రోజులూ కాస్త జాగ్రత్త సుమీ

Leave a Reply