ఈ నెల 28నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌..

AP eamcet 2018 counseling on may 28
Share Icons:

విజయవాడ, 24 మే:

ఏపీ ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ విభాగంలో అర్హత సాధించిన విద్యార్ధులకు ఈ నెల 28 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

అలాగే మే 30వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు వెబ్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 3-4 తేదీల్లో ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశముంది.

5న సీట్ల కేటాయింపు జరగనుంది. 12 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, తొలిసారిగా అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లోనే పరిశీలించనున్నారు. గతంలో లాగా విద్యార్ధులు సర్టిఫికెేట్ల వెరిఫికేషన్‌ కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.

తమ ఇంటి వద్ద నుంచి గానీ, ఇంటర్నెట్‌ సెంటర్ల నుంచి గానీ నేరుగా ర్యాంకర్లు ‌ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌లో తమకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్‌ సీటు కావాలో ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు.

ఇది ఇలా ఉండగా ఈ నెల 2న విడుదల చేసిన ఎంసెట్‌ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 2,363 మందికి గురువారం ర్యాంకులు ఇస్తున్నట్లు ఎంసెట్‌-2018 కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు.

వీరిలో ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ద్వారా మార్కులు పెరిగిన 1,863 మంది అభ్యర్థులకు రివైజ్డ్‌ ర్యాంకులు ఇస్తామని చెప్పారు. అలాగే ఇంటర్‌ బోర్డు కాకుండా ఇతర బోర్డులకు చెందిన డిక్లరేషన్‌ ఫారం అందజేసిన మరో 500 మందికి కొత్తగా ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

మామాట: మరి మెడిసిన్ కౌన్సెలింగ్ ఎప్పుడో?

Leave a Reply