ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ వైద్యం: ఆదాయం 5 లక్షలు దాటితే…?

ap-cm-ys-jagan-inaugurates-aarogyasri-scheme
Share Icons:

ఏలూరు: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి క్యాన్సర్ రోగులకు కూడా ఆర్థిక ఊరట దక్కనుంది. ఇక నుంచి క్యాన్సర్ రోగులకు పూర్తిగా వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే కుటుంబ ఆదాయం రూ.5 లక్షలకు మించవద్దు. ఈ ఆదాయం లోపు ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అటు జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 510 రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా సరఫరా చేసే మెడిసిన్స్ నాణ్యత మరింత పెంచనున్నారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అమలవుతుంది ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోను ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.

ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలోను పేషెంట్లకు ఆర్థిక సహాయం అందించనుంది ప్రభుత్వం. రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద 2,059 వ్యాధులకు వైద్య సేవలు అందించనున్నారు. ఇంతకుముందు 1,059 సేవలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ఇప్పుడు మరో వెయ్యి సేవలను జోడించారు. వైద్య సేవల ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తారు. అటు ఆరోగ్య శ్రీకి ప్రత్యేక కార్డులు ఇస్తున్నారు. ఈ రోజు (డిసెంబర్ 3) తేదీ నుంచి మొత్తం కోటి 42 లక్షల కార్డులు ఇస్తారు. ఆరోగ్యశ్రీ కార్డుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. జిల్లాల వారీగా వరుసగా ఇస్తారు.

ఇక డయాలాసిస్‌ రోగులకు రూ.10వేల పెన్షన్‌, పక్షవాతం, తలసేమియా రోగులకు రూ.5 వేలు పెన్షన్‌ అందిచనున్నారు. ఆస్పత్రుల్లో పారిశుధ్య కార్మికులకు జీతం రూ. 8 వేల నుంచి రూ. 16వేలు పెంచుతున్నారు. నాడునేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చనున్నారు.

 

Leave a Reply