ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
Views:
51

అమరావతి, జూన్ 20,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూలోటును భర్తీ చేయాలని చంద్రబాబు ఈ లేఖలో కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. కాగా, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడప ఉక్కు, రెవిన్యూ లోటు, విభజన చట్టంలోని అంశాలను వెంటనే అమలుచేయాలని సీఎం తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

మామాట: ఇప్పటికైనా నారావారు కళ్లుతెరిచారు, కలం విదిల్చారు.

(Visited 85 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: