ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన జగన్, చంద్రబాబు…

Share Icons:

అమరావతి, 12 జూన్:

ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

తొలుత ముఖ్యమంత్రి జగన్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా….తర్వాత ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఐదుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేశారు. ఇక ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.

కాగా, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోయేముందు చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో, వారికి సహకరిస్తూ ఆరు నెలల పాటు మౌనంగా ఉండాలని తొలుత అనుకున్నామని…. కానీ, టీడీపీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని… అందుకే వైసీపీకి సమయం ఇవ్వడం అనవసరమని అనిపిస్తోందని చెప్పారు.

Leave a Reply