ఆరోగ్యశ్రీ ఆసరా మొదలు…వారికి లబ్ది…

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ఆసరా పథకం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు సీఎం జగన్ గుంటూరు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. “నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. నా మతం మానవత్వం అని ఈ వేదికపై నుంచి చెప్పలదచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని పనిచేస్తున్నా” అని జగన్ అన్నారు. ఓ గొప్ప కార్యక్రమానికి నేడు అంకురార్పణ జరిగిందని, వైద్యం చేయించుకునేందుకు ఇకపై ఏ పేదవాడూ ఇబ్బందులు పడబోడని హామీ ఇస్తున్నానని అన్నారు. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

కాగా, ఆరోగ్య శ్రీలో భాగంగా 26 విభాగాల్లో 836 శస్త్రచికిత్సలకు ఆర్థికసాయం వర్తించనుంది. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలోనూ ఆర్థికసాయం అందుతుంది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 150కి పైగా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందిస్తాయని జగన్ గుర్తు చేశారు.

లోకేశ్ పై విజయసాయి విమర్శలు

ప్రతిరోజూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై తీవ్ర విమర్శలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన లోకేష్… రూ.58 కోట్లను సింగపూర్‌కి తరలించారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తయారీకి రూ.58 కోట్లు ఖర్చు చేసినట్లు డ్రామాలాడిన నారా లోకేష్… ఆ డబ్బును సింగపూర్‌కి మల్లించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

అంతేకాదు, దీనిపై దర్యాప్తు జరుగుతోందనీ త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నట్లుగా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. మహిళల భద్రతపై బాధపడిపోతున్నట్లు చిట్టి నాయుడు నటిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఇక ఈ ఆరోపణలే నిజమైతే అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాబట్టి నారా లోకేష్‌ కు ఇబ్బందులు తలెతెత్తోచ్చు. ఒకవేళ్ళ అదే ఆరోపణలు అబద్ధమైతే… తనపై చేసిన ఆరోపణలపై లోకేష్ పరువు నష్టం దావా వేస్తే… అది విజయసాయిరెడ్డికి ఇబ్బంది కలిగించే అంశం అవ్వొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

Leave a Reply