అమరావతికే బీజేపీ మద్ధతు…మోడీని కలవనున్న జగన్…!

Share Icons:

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునే విషయంలో జగన్ ప్రభుత్వం కొంచెం ఆలస్యం చేసేలా కనిపిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని అంశంపై హై పవర్ కమిటీ నిర్ణయం వచ్చాకే అసలు విషయం చెబుతామని ప్రకటించింది. ఇక జగన్ ప్రభుత్వం పూర్తి క్లారీటీ ఇవ్వకోపోయిన టీడీపీ, జనసేన ఇతర పార్టీలు అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అటు అమరావతి రైతులు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయాణ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మౌన దీక్ష్ చేయగా..పార్టీ నేతలు రైతుల నిరసనల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దీనిని వ్యతిరేకంచటమే కాకుండా..తాజాగా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని నగరాన్ని వేరే చోటకు తరలించడానికి వీల్లేదని బీజేపీ అధిష్ఠానం స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు సమాచారం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని, దరిదాపుగా రూ.9 వేల కోట్ల పనులు జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఇక ప్రస్తుతం రాజధాని అంశంపై కమిటీల పేరుతో నిర్ణయం వాయిదా వేసినా.. కేంద్రం నుండి అభ్యంతరాలు లేకుండా చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం తానే స్వయంగా ప్రధాని మోదీ.. అమిత్ షా ను కలిసి ఈ నిర్ణయం వెనుక కారణాలను వివరించాలని భావిస్తున్నారు. అందు కోసం ఈ వారంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. రాజధాని పేరుతో జరిగిన అక్రమాలను వివరించటంతో పాటుగా.. మూడు రాజధానుల ప్రతిపాదనల గురించి సవివరంగా నివేదించాలని నిర్ణయించారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. దీంతో..ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో వచ్చే సంకేతాలు ప్రభుత్వ తదుపరి అడుగులకు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

 

Leave a Reply