మూడు రాజధానుల ఫార్ములాపై ముందుకే…!

ap cm jagan new scheme to introduce weavors
Share Icons:

ఏలూరు: మూడు రాజధానుల అంశంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి క్లారీటీ ఇచ్చారు. ఈరోజు ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… మూడు రాజధానుల ఫార్ములాతో ముందుకెళ్తామని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.  కొందరికే న్యాయం జరిగిందంటూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సీఎం రాజకీయ విమర్శలు చేశారు. నాటి నిర్ణయాలను సరిదిద్దుతామన్నారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, పరిపాలన అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని జగన్ స్పష్టం చేశారు. తమ దృష్టిలో మూడు ప్రాంతాలూ సమానమేనంటూ రాజధానిపై పరోక్షంగా జగన్ క్లారిటీ ఇచ్చారు.

అటు రాజధాని అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి. ఆందోళన చేస్తున్న మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈరోజు నుంచి అమరావతి రైతులు సకల జనుల సమ్మెకు దిగారు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, ప్రజలు. తమకు న్యాయం జరగాల్సిందే అంటూ… తమ ఆందోళనలను పెంచుతూ… మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో… మందడంలో… మహిళల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కొంత మంది మహిళల్ని అరెస్టు చేశామంటున్నారు పోలీసులు. అలాగే అమరావతి రైతులు… సకల జనుల సమ్మెను ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. 16 రోజులుగా చేస్తున్న తమ ఆందోళనలను సీఎం జగన్ పట్టించుకోవట్లేదనీ… తామేంటో చూపిస్తామని అంటున్నారు. మొత్తంగా అమరావతి రైతులు ఎంతగా ఆందోళనలు చేస్తున్నా… ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply