టాలీవుడ్ నటులకు జగన్ ప్రాధాన్యం…నెక్స్ట్ లైన్ లో ఉన్నది వీళ్ళే

ap cm jagan sweet warning to ministers
Share Icons:

అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేకమంది టాలీవుడ్ నటులు జగన్ నేతృత్వంలోని వైసీపీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. చాలామంది నటులు జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. అలాగే ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఇక తర్వాత జగన్ భారీ మెజారిటీతో గెలవడం తొలిసారి సీఎం అవ్వడం జరిగిపోయాయి. దీంతో జగన్ ఒక్కో టాలీవుడ్ నటులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నటులకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. హాస్య నటుడు పృథ్వీకి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగాయి. పృథ్వీతో పాటు ఇంకొందరికి కూడా పదవులు ఇచ్చారు.

అందులో చాలా కాలం కింద ఖాళీ అయిన ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ పదవిని ఇప్పుడు సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు అప్పగించారు.  వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాత అంబిక కృష్ణ ఈ పదవికి రాజీనామా చేసాడు. ఆ తర్వాత ఏపీ ఫిలిం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ అలాగే ఉండిపోయింది. జయసుధ ఈ పదవిలో కూర్చుంటుందనే ఊహాగానాలు వినిపించినా కూడా ఇప్పుడు విజయ చందర్‌కు ఇచ్చారు.

ఇక ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సినీ నటి రోజాకు ఏ‌పి‌ఐ‌ఐ‌సి ఛైర్మన్ పదవికట్టబెట్టారు. అలాగే జగన్ దగ్గర బంధువు మోహన్ బాబుకు కూడా జగన్ ఏదొక పదవి ఇస్తారని చర్చ జరుగుతుంది. అటు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతికి తెలుగు అకాడమి ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవల కాలంలో తన తరువాత పార్టీలోకి వచ్చిన పృథ్వీకి తన కంటే ముందు పదవి రావడంపై పోసాని కృష్ణమురళి పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ నాయకత్వం… ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది.

ఇంకా వెయిటింగ్ లిస్టులో మోహన్ బాబు, అలీ, పోసాని, రాజశేఖర్ దంపతులు హేమ, భాను చందర్, కృష్ణుడు లాంటి వాళ్లున్నారు. మరి వాళ్లకెప్పుడు ఈ పదవులు వరిస్తాయో చూడాలిక.

Leave a Reply