ఢిల్లీలో పలువురు మంత్రులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Share Icons:

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు (గురువారం) కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం జగన్‌ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  షెకావత్‌తో సీఎం జగన్‌ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది.

కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం సీఎం జగన్‌.. ఈ రోజు(గురువారం) గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే.  సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్‌ చర్చించనున్నారు.

ఈ రెండు రోజుల పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌లను కూడా సీఎం జగన్‌​ కలవనున్నారు. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం తాడేపల్లి చేరుకుంటారు.

-మామాట విలేఖరి.

Leave a Reply