జగన్ బంపర్ ఆఫర్…వాలంటీర్ల జీతం పెంపు?

Share Icons:

అమరావతి: ప్రభుత్వ పథకాలని నేరుగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ గ్రామ వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున పని చేస్తూ ఇప్పటికే సేవలు చేస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వం రూ.5 వేలం జీతం ఇస్తుంది. అయితే దీనిపై వాలంటీర్లలో కొంత అసంతృప్తి ఉంది. అలాగే అటు చదువుకున్నవారి చేత మూటలు మోయిస్తూ…తక్కువ జీతం ఇవ్వడం అన్యాయమని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా వాలంటీర్ల జీతం పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాలంటీర్ల సమస్యలను..కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారి వేతనాల పెంపు పైన ఫోకస్ చేసింది. దీని పైన ముఖ్యమంత్రి జగన్ సైతం సానుకూలంగా ఉన్నారు. దీంతో..ఆయన వారి పనితీరు గురించి అధికారులతో చర్చ చేసారు. ఇన్ని రకాల ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్న సమయంలో..వాలంటీర్లకు పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది.

ప్రస్తుతం వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం రూ 5 వేల నుండి రూ 8 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. కానీ ఈ విషయం గురించి అధికారుల నుండి, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత మాత్రం రాలేదు. ఈరోజు సాయంత్రం భేటీ తరువాత గ్రామ వాలంటీర్ల జీతాలు నిజంగా పెంచుతున్నారో లేదో పెంచితే పెరిగిన జీతాలు ఎప్పటినుండి అమలు అవుతాయనే విషయాల గురించి స్పష్టత వస్తుంది.

కాగా, ఆగస్టు నెల 15వ తేదీన విధుల్లో చేరిన వారికి అక్టోబర్ నెల 1వ తేదీన వారి ఖాతాల్లో ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు 7,500 రూపాయలు జమ అయ్యాయి. ఈరోజు సీఎం జగన్ గ్రామ వాలంటీర్ల ప్రధాన కార్యదర్శితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో సీఎం జగన్ పలు అంశాల గురించి చర్చించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,85,525 మంది గ్రామ, వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

గ్రామ వాలంటీర్ల ప్రధాన కార్యదర్శితో జరిగే భేటీలో గ్రామ వాలంటీర్ల జీతం పెంపు గురించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం కృష్ణా జిల్లాలో నలుగురు గ్రామ వాలంటీర్లు ఫించన్ పంపిణీ చేసే సమయంలో 50 రూపాయల చొప్పన వసూలు చేసారని ఆరోపణలు వచ్చాయి. వెంటనే వారిని విధుల నుంచి తొలగించారు కూడా. అవినీతిని మొగ్గలోనే తుంచేయాలని జగన్ అధికారుల దగ్గర అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

Leave a Reply