రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారు: హై పవర్ కమిటీ పని మొదలు…

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచన ప్రాయంగా చెప్పిన మూడు రాజధానుల అంశంపైనే ప్రభుత్వం ముందుకెళుతుంది. ఇప్పటికే నివేదికలు సమర్పించిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ సైతం విశాఖలో పరిపాలనా రాజధానికి సిఫార్సులు చేసాయి. బోస్టన్ కమిటీ అయితే విశాఖనే అన్నిటికి అనుకూలంగా ఉంటుందని తేల్చేసింది. రాజధాని నిర్మాణ వ్యయాన్ని నియంత్రణతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయొచ్చని అభిప్రాయపడింది. అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని.. అదే విశాఖలో రాజధాని ఉంటే ప్రజాధనం ఆదా అవుతుందని పరోక్షంగా తెలిపింది. రాజధాని విషయంలో ప్రభుత్వానికి రెండు ఆప్షన్లు ప్రతిపాదించింది.

ఆప్షన్ 1

విశాఖ: గవర్నర్- సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖలు, టూరిజం శాఖ, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

అమరావతి: అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌కు సంబంధించి మూడు హెచ్‌ఓడీ కార్యాలయాలు, అగ్రికల్చర్‌కు సంబంధించి నాలుగు హెచ్‌ఓడీ కార్యాలయాలు, సంక్షేమ–స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌.

కర్నూలు: హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు

అప్షన్ 2

విశాఖ: సచివాలయం, గవర్నర్‌ – సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్లు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్‌ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌.

అమరావతి: అసెంబ్లీ, హైకోర్టు బెంచ్. కర్నూలు: హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు

ఇక ఈ రెండు ఆప్షన్లలో బి‌సి‌జి కమిటీ మాత్రం ఫైనల్‌గా ఆప్షన్-2నే బెటర్ అని తేల్చింది. ఇక బి‌సి‌జి కమిటీ రావడంతో హై పవర్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.

ఈ నెల 6వ తేదీ నుండి ఈ కమిటీ వరుసగా భేటీ కానుంది. ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ మేరకు ఈ నెల 17వ తేదీన కమిటీ తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించనుంది. ఆ మరుసటి రోజే అంటే జనవరి 18న ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై..హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయనుంది. ఆ వెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు.

ఈ నెల 6వ తేదీ నుండి ఈ కమిటీ వరుసగా భేటీ కానుంది. ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ మేరకు ఈ నెల 17వ తేదీన కమిటీ తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించనుంది. ఆ మరుసటి రోజే అంటే జనవరి 18న ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై..హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయనుంది. ఆ వెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ ఉమ్మడి సమావేశాల్లో ఈ రాజధానుల ప్రతిపాదన పైన తీర్మానం ప్రవేశ పెడతారు. అధికార పార్టీ నుండి మూడు ప్రాంతాలకు చెందిన నేతలు ప్రభుత్వ తీర్మానం సమర్దిస్తూ మాట్లాడేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. మొత్తానికి త్వరగా విశాఖ నుండి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇక..అక్కడ పాలన ఎప్పుటి నుండి అధికారికంగా మొదలవుతుందీ…అమరావతి రైతులను శాంతింప చేసేందుకు ఏం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం.

 

Leave a Reply