నేడు జగన్-కేసీఆర్ భేటీ: రాజకీయాలా? అభివృద్దా? చర్చ దేనిపైనా?

cm jagan mohan reddy new decision...iits creates gap of telangana cm kcr
Share Icons:

హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కానున్నారు.  ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విందుకు ఆహ్వానించారు. సీఎం జగన్ రెండు రోజులుగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే ఉంటున్నారు. అయితే ఈ సమావేశానికి అధికారులకు సమాచారం లేదు. దీంతో..ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏకాంత సమావేశం జరగనుంది.

ఇక వీరి మధ్య రాజకీయాల గురించే ఎక్కువ చర్చ జరిగేలా కనిపిస్తోంది. రాజధాని అమరావతిని విశాఖకు మార్పు వ్యవహారం.. దీనిపై అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు కూడా చర్చకు వచ్చే వీలుందని సమాచారం. గతంలో కేసీఆర్ అమరావతి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ పెట్టే పెట్టుబడి డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా చెప్పారు.

అయితే ఇప్పుడు జగన్ సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనల పైన రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు..చంద్రబాబు రాజకీయ యాత్ర పైనా ఇద్దరు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ కొన్ని సూచనలు సైతం చేసే ఛాన్స్ ఉంది. ఇక, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పైనా ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే గతంలో మూడు సార్లు సమావేశమైన సమయంలో వీరిద్దరితో పాటుగా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధికారులు రావటం లేదు. ప్రధానంగా గతంలో వీరు తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోసే పథకంపై చర్చించారు. కానీ, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి దానికి సుముఖంగా కనిపించటం లేదని సమాచారం. దీంతో..ఈ సమావేశంలో రాయలసీమ కాలువల విస్తరణలో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలని జగన్‌ నిర్ణయించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. దీనిపైనా ఇద్దరు సీఎంలు చర్చించే వీలుంది. ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేయటం సమయంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్టీసీ పైన ఇద్దరు మఖ్యమంత్రుల అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి.

 

Leave a Reply