నేడు లోటస్ పాండ్‌కు జగన్…13న కేసీఆర్‌తో భేటీ

cm jagan mohan reddy new decision...iits creates gap of telangana cm kcr
Share Icons:

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి…తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఈ నెల 13న జగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మకాం వేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లనున్న సీఎం జగన్ తిరిగి 13వ తేదీ సాయంత్రం అమరావతికి తిరిగి వస్తారు. లోటస్ పాండ్ లోనే ఆయన బస చేయనున్నారు. ఇక, ఈ నెల 13వ తేదీన ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం భేటీ అవుతున్నారు. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరు సీఎంల భేటీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తిక రంగా మారుతోంది.

ఇక జగన్ సీఎం అయిన తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. జగన్ సీఎం అయిన తొలి మూడు నెలల కాలంలోనే ప్రగతి భవన్ లో ..అటు అమరావతిలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరిగాయి. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత వారు భేటీ కానున్నారు. అయితే వీరి మధ్య గతంలో ప్రతిపాదించిన గోదావరి జలాల తరలింపు విషయంతో పాటుగా జాతీయ స్థాయిలో రాజకీయాలు,..తమ రెండు పార్టీల కార్యచరణ పైనా చర్చంచే అవకాశం కనిపిస్తోంది.

మూడు రాజధానుల అంశం పైన రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీ నేతలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నియ మించిన హైపవర్ కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశమై..రెండు సమావేశాల సారాంశాన్ని వివరించనుంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటన ఆసక్తి కరంగా మారింది. అయితే, వచ్చే వారం లో మూడు రాజధానులకు సంబంధించి కీలకమైన అధికారిక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగానే అసెంబ్లీలోనూ దీనికి ఆమోద ముద్ర లభించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

 

Leave a Reply