చేను మేసిన కంచె

Share Icons:

వార్త:

తన సహాయం కోరి వచ్చిన అత్యాచార బాధితురాలి ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మాజీ సైనికుడు ఒక బాలికను కిడ్నాప్ చేసి 50 రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులతో సీఎంను కలిసిన బాధితురాలు.. న్యాయం చేయమని వేడుకుంది. వారి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, వారితో ఫొటో దిగిన చంద్రబాబు.. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

వ్యాఖ్య:

సాక్షాత్తూ సీఎమ్మే అత్యాచార బాధితురాలితో ఫోటో దిగి.. దాన్ని అందిరికీ తెలిసేలా బహిరంగపరచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అత్యాచార బాధితురాలి పేరు, ఫొటో వెల్లడించకూడదన్న విషయాన్ని చంద్రబాబు అంతటివారు విస్మరించడమేంటని పలువురు ఆక్షేపిస్తున్నారు.

విశ్లేషణ:

అత్యాచార బాధితుల పేర్లు, ఫొటోలు వెల్లడించడం- లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (ఫోక్సో) ప్రకారం నేరం.  దీన్ని అతిక్రమించినవారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవచ్చు. సీఎం కార్యాలయం తీరును జాతీయ బాలల హక్కుల కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్ శాంతి సిన్హా కూడా తప్పుపట్టారు. నిర్భయ ఘటనలో బాధితురాలి పేరును ఇప్పటికీ బయటపెట్టలేదని గుర్తు చేశారు. మైనర్ బాలికలకు సైతం ఈ హక్కులే ఉంటాయన్నారు. కానీ, ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘించే సరికి ఏం చేయాలో పాలుపోక.. అధికారగణం అంతా మౌనం వహించింది.

విలాసం:

ఆధునికతకు ఆది పురుషుడిననీ, హైటెక్కు ముఖ్యమంత్రిననీ చెప్పుకునే చంద్రబాబు ఇలా పప్పులో కాలేయడం ఆశ్చర్యకరమే. ఎంతటివారైనా ఆలోచనతోగాక, అహంకారంతో ముందుకుపోతే ఇలాంటి తప్పిదాలే జరుగుతాయని మరోసారి రుజువైంది. అయితే, విమర్శల వెల్లువకు ఖంగుతున్న సీఎంవో సోషల్‌ మీడియా నుంచి బాధితురాలి కుటుంబం ఫొటోను తొలగించడం కొసమెరుపు.

-లైన్ కింగ్

4 Comments on “చేను మేసిన కంచె”

  1. అడుసు తొక్కడం ఆపైన నలుగురూ మొట్టికాయలు వేశాక నాలుక కరచుకుని కాళ్లు కూడా కడుక్కోకుండా మడమ తిప్పడం మన ‘నాచంబానా’కు పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఆయనకు బాధితులకు న్యాయం జరగడం ప్రధానం కాదు, వారు తనను ఆశ్రయించారని ప్రపంచానికి దండోరా వేసుకోవడానికే తొలి ప్రాధాన్యత. ఇలా కాలుజారడం క్రొత్తేమీ కాకున్నా ఈ దిగజారుడు, అదీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వ్యవహరించడం మరీ ఛండాలం..

    1. మీరు ప్రచురించిన ట్విట్టర్ ఫోటోలో చంద్రబాబుతో పాటు ఉన్న బాధితురాలిని షేడ్ చేసి చూపించడం బాగుంది.
      మీరు రాసిన వార్తలో విశ్లేషణ మరింత ఉండాల్సింది.

  2. ఇలా చేయడం తప్పు కదా…………ఇలా పేరు ప్రకటించడం ఫోటోలు పెటడం బాగుండదు కదా….

Leave a Reply