ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు…

ap cm jagan mohan reddy comments on pawan kalyan
Share Icons:

అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీ నుండి సమావేశాలు ప్రారంభించాలని భావించినా.. 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కారణంగా ఎమ్మెల్యేలు ఆ రోజు సభకు రావాల్సి ఉంటుంది. దీంతో..ఆ మరుసటి రోజు నుండే సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా సాధారణ బడ్జెట్ కు అవకాశం లేకపోవటంతో ఈ నెల 28న రెండు నెలలకు సంబంధించిన పద్దులతో ఓట్ ఆన్ ఎకౌంట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 31లోగా ఈ పద్దుకు ఆమోదం పొందాల్సి ఉంది. దీంతో..31న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపి సమావేశాలను వాయిదా వేయనున్నారు.

ఏపీ ప్రభుత్వం 2020-2021 వార్షిక బడ్జెట్ స్ధానంలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కేవలం రెండు నెలలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలతో ఈ నెల 28న ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 27న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ..అదే రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 30, 31 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి ముఖ్యమంత్రి సమాధానం తో పాటుగా బడ్జెట్ పైన చర్చ చేపడుతారు. 31లోగా ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

లేని పక్షంలో ప్రభుత్వం జీతాలకు కూడా నిధుల విడుదలకు అనుమతి ఉండదు. దీంతో..రెండు నెలల పద్దుల పైన చర్చ నిర్వహించి ఈ నెల 31న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపటంతో సభను నిరవధికంగా వాయిదా వేసేలా ప్రణాళిక సిద్దం అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇక, వైసీపీ నుండి 151 మంది సభ్యులు ఉండటంతో..పోటీలో ఉన్న నలుగురు అభ్యర్ధులకు వీరిని విభజించనున్నారు. ముగ్గురు అభ్యర్ధులకు 38 మంది చొప్పున.. నాలుగో అభ్యర్ధికి 37 ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను ఖరారు చేస్తున్నారు. ఇక, టీడీపీ పోటీలో ఉన్నా సంఖ్యా బలం లేకపోవటంతో వైసీపీ నలుగురు అభ్యర్ధుల విజయం లాంఛనంగానే కనిపిస్తోంది.

 

Leave a Reply