చంద్రబాబు అబద్ధాల పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు..

somu veerraju fires on tdp party
Share Icons:

రాజమహేంద్రవరం, 4 సెప్టెంబర్:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న పెట్రోల్ ధరలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలని తప్పుబట్టారు. రాజమహేంద్రవరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్‌ రేట్‌ రూ.100కు చేర్చుతారన్న సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మండిపడ్డారు.

అసలు పెట్రోల్‌పై ఏ రాష్ట్రంలోని లేని పన్నుల భారం ఏపీలో ఉందని, ఏపీలో పెట్రోల్‌ రేటును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

ఇక చంద్రబాబు టీడీపీకి కాకుండా, అబద్ధాల పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ సోమువీర్రాజు విమర్శించారు. మోదీపై అపవాదు వేసేందుకు పెట్రోల్‌ రేటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టినవారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవినీతి సొమ్మును అమరావతి బాండ్లలోకి మళ్లిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.

మామాట: మీ పార్టీపై నిందలు పడకుండా బాగానే కవర్ చేస్తున్నారుగా…

Leave a Reply