ఈ స్పీకర్ చాలా వెరైటీ గురూ…! అసెంబ్లీలో స్పీకర్..బయట ఎమ్మెల్యే

ap assembly speaker tammineni sitaram play different roles
Share Icons:

అమరావతి:

స్పీకర్ పాత్ర ఎంతవరకు పరిమితంగా ఉంటుందో అందరికీ తెలుసు…అధికార పక్షానికి చెందిన నేతే అయినప్పటికి స్పీకర్ పదవిలో ఉంటే రాజకీయాలకు అతీతంగా  ఉంటారు. అసెంబ్లీలో గానీ బయటగానీ రాజకీయాలు జోలికి వెళ్లరు. అయితే ప్రస్తుత ఏపీ స్పీకర్ పాత్ర దీనికి విరుద్ధంగా ఉంది. గతంలో ఉన్న స్పీకర్లకి భిన్నంగా తమ్మినేని సీతారాం వైఖరి ఉంది. హౌస్ లో న్యూట్రల్ గా ఉంటూనే అవసరమైన చోట ప్రతిపక్ష టీడీపీకి చురకలు అంటిస్తున్నారు.

తమ్మినేని సహజంగా మంచి వక్త కావడంతో రాజకీయాలకి అతీతమైన పదవిలో ఉన్న సైలెంట్ గా ఉండటానికి ఇష్టపడట్లేదు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చాలా సందర్భాల్లో టీడీపీ తన మీద ఆరోపణలు చేస్తే వాళ్ళకి గట్టిగా క్లాస్ పీకారు కూడా. అయితే అసెంబ్లీ అయిపోతే స్పీకర్ పెద్దగా కనిపించారు. కానీ తమ్మినేని మాత్రం అసెంబ్లీ అవగానే తన నియోజకవర్గంలో పర్యటిస్తూ రాజకీయనాయకుడిలా మాట్లాడేస్తున్నారు.

ఇటీవల జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పాల్గొనప్పుడు తమ్మినేని ఏ రేంజ్ లో రాజకీయ నాయకుడిగా మాట్లాడారో చూశాం కూడా. జగన్ ని పొగుడ్తూనే టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఇక తాజాగా ఓ సభలో ఆయన మాట్లాడుతూ…ప్రజల కోసం ఖచ్చితంగా సమీక్షలు నిర్వహించే బాధ్యత, అధికారం తనకు ఉన్నాయని, దీన్ని ఎవరు ఆపుతారో చూస్తానని అన్నారు.

మొదట తాను ఒక నియోజకవర్గానికి శాసన సభ్యుడినని, ఆ తర్వాతే శాసన సభకు సభాపతిని అని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్‌గా తన నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించకూడదని ఏ రాజ్యాంగం చెప్పిందని ప్రశ్నించారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని, ప్రజా సంక్షేమం కోసం దేనికైనా సిద్ధమేనన్నారు. స్పీకర్‌గా శాసనసభలో హుందాగా ఉంటానన్నారు.

అటు గ్రామ వలంటీర్లను భవిష్యత్‌లో టైంస్కేలు ఉద్యోగులుగా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని సీతారాం అన్నారు. వలంటీర్ల విధులకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. గ్రామ సచివాలయాలు ఏర్పడిన తర్వాత ఆ సంస్థ ఉద్యోగులతో కలిసి ప్రజలకు సేవలందిచనున్నారన్నారు. భవిష్యత్‌లో రాజకీయాల్లో మహిళలే మహరాణులు అవుతారని, పదవుల్లో వారికి 50 శాతం కేటాయించినట్టు తెలిపారు. మొత్తానికి తమ్మినేని అసెంబ్లీ స్పీకర్ పాత్ర, బయట ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు.

Leave a Reply