మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ…

Share Icons:

అమరావతి, 23 ఫిబ్రవరి:

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.4, 5 లను విడుదల చేసింది.

మార్చి 5వ తేదీ (సోమవారం) ఉదయం రూ.9.30 నిమిషాల నుంచి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో పేర్కొంది.

మార్చి 5న ఉదయం 9.30 గంటలకు సభ ప్రారంభం అయ్యాక ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. 6, 7 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ , ఆ చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిస్తారు. మార్చి 8న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ఇక మార్చి 28తో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 29న గవర్నర్‌ విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 28నే అప్రాప్రియేషన్‌ బిల్లును ఆమోదించాలని అనుకుంటుంది.

మామాట: మరి ఈ సమావేశల్లో ప్రతిపక్ష పార్టీ పాల్గొంటుందా…?

English summary:

The Legislative Assembly and Legislative Council of Andhra Pradesh will begin on March 5. The state government has released GO No. 4 and 5 on this basis.

Leave a Reply