Header Banner
Header Banner
TRENDING NOW

ఓటర్లు 299.. పోలైన ఓట్లు 350!

ఓటర్లు 299.. పోలైన ఓట్లు 350!

అమరావతి,ఏప్రిల్ 18,

ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో విచిత్రం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం 48వ పోలింగ్ కేంద్రంలో, అద్దంకి పట్టణంలోని 154వ పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల కంటే పడిన ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సంతమాగులూరు మండలంలోని 48వ పోలింగ్‌ కేంద్రంలో 299 మహిళా ఓటర్లు ఉండగా 350 ఓట్లు పడినట్లు ఎన్నికల అధికారులు నమోదు చేశారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

అలాగే అద్దంకి పట్టణంలోని 154 పోలింగ్‌ కేంద్రంలో 435 మంది పురుష ఓటర్లు ఉండగా, 500 ఓట్లు పోలైనట్లు చూపారు. నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదయిందని ఎంట్రీలు రాశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

దీంతో  ఎన్నికల అధికారి సాయిబాబు స్పందిస్తూ.. ఎన్నికల రోజున హడావుడిలో కంప్యూటర్‌లో ఈ వివరాలను తప్పుగా నమోదుచేశారని అంగీకరించారు. కేవలం కంప్యూటర్ ఎంట్రీలో మాత్రమే పొరపాటు జరిగిందనీ, వీటిని సరిచేసి తిరిగిపంపిస్తామని స్పష్టం చేశారు.

 

మామాట:  సరిదిద్దుకోవడానికే కదా సమయమిచ్చింది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: