TRENDING NOW

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…
views:
3

విజయవాడ, 3 డిసెంబర్:

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దీసేపటి క్రితం విడుదల చేశారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు ఈ నెల 7లోపు దరఖాస్తు చేసుకోవాలని, 2019 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఇక పరీక్షల కోసం ఇప్పటివరకూ 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ కోసం 2,833 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.

ఇక వీటిలో 91 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించామని,  ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతను పెంచడంతో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పరీక్షల నిర్వహణ పూర్తయ్యాక నెల రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి అన్నారు. మాస్ కాపియింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మామాట: పరీక్షల కాలం మొదలైంది అనమాట…

(Visited 14 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: