అనుష్క ప్రధాన పాత్రలో థ్రిల్లర్ మూవీ…!

Share Icons:

హైదరాబాద్, 12 జనవరి:

గ‌త ఏడాది మొద‌ట్లో భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అలరించిన అనుష్క… మరో థ్రిల్లర్ సినిమా చేయడానికి సిద్ధమైంది. కోన వెంకట్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఎక్కువ శాతం అమెరికాలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. అలాగే ఇందులో హాలీవుడ్ న‌టులు కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీ లో అనుష్క , మాధవన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. అయితే ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగు త‌మిళ భాష‌ల‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అంటున్నారు. ఏడాది చివర్లో విడుదలకానుంది.

మామాట: అనుష్క మళ్ళీ భయపెట్టనుంది అన్నమాట…

Leave a Reply