టీడీపీని వీడనున్న మాజీ మంత్రి?

tdp mla's condemn the news to spread they are ready to join bjp
Share Icons:

 

ఆపరేషన్ కమలం పేరుతో ఏపీలో దూసుకుపోతున్న బీజేపీ ఇతర పార్టీల నేతలనీ చేర్చుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరగా, మరికొందరు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష  టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమరావతి:

కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేశ్ ద్వారా ఆదినారాయణ రెడ్డి పార్టీ మారేందుకు చూస్తున్నారని సమాచారం. ఇక ఆదినారాయణ మూడు సార్లు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. అనంతరం మంత్రి పదవి పొందారు.

 

ఇక ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించిన ఆదికి చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. ఆయనను కాదని జమ్మలమడుగు టిక్కెట్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. దాంతో ఆదినారాయణరెడ్డి అయిష్టంగానే ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పత్తా లేకుండా పోయిన ఆది.. బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply