తెలంగాణ టీడీపీ నుంచి మరో నేత జంప్…

Another tdp leader jump to trs party
Share Icons:

హైదరాబాద్, 26 మే:

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి క్షీణిస్తుంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా వేరే పార్టీలలో చేరిపోతున్నారు.

తాజాగా రెండు రోజుల క్రితమే ఆ పార్టీ ముఖ్య నేత గజ్వేల్ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇక ఇప్పుడు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ముఖ్య అనుచరుడు, జగిత్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా పని చేసిన బోగ వెంకటేశ్వర్లు పార్టీకి రాజీనామా చేశారు.

మహానాడు వేదికగా రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం  ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు.

రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆయన  టీఆర్‌ఎస్‌లో చేరడం చకచకా జరిగిపోయింది.

కాగా, 15రోజుల క్రితం కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న సాంబారి ప్రభాకర్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తీర్థం  పుచ్చుకోగా, తాజాగా జగిత్యాల ఇన్‌ఛార్జి గులాబీ గూటికి చేరుకోవడంతో ఎల్. రమణ సొంత నియోజకవర్గం అయిన జగిత్యాలలో టీడీపీ పార్టీ ఇప్పుడు పూర్తిగా దెబ్బతినే స్టేజ్‌కి వచ్చింది.

మామాట: తెలంగాణలో టీడీపీకి గడ్డు కాలమే

Leave a Reply