వైసీపీలోకి మరో చేరిక…ఆ మాజీ మంత్రి కూడా జంప్ అయిపోతారా?

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఫ్యాన్ కిందకు వచ్చారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు సోదరుడి కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్ధా హనుమంత రావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకొన్నారు.

శిద్ధా రాఘవరావు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు రావడం, కొన్ని రోజుల్లోనే శిద్ధా హనుమంత రావు వైసీపీలో చేరడం వంటి కీలక పరిణామాలు వెంట వెంటనే చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో కలకలాన్ని రేపాయి. జిల్లాకు చెందిన కొందరు పార్టీ సీనియర్ నాయకులు శిద్ధా రాఘవరావుకు సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆయన అందుబాటులో లేకుండా పోయినట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన కూడా వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమౌతున్నాయి.

మొన్నటికి మొన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కదిరి బాబురావు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ మరుసటి రోజే జిల్లాకే చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్, మాజీమంత్రి పాలేటి రామారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్ధా రాఘవరావు పార్టీని వీడే అవకాశాలు ఉండటం టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు.

కాగా, గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శిద్ధా ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి రాఘవరావు పోటీ చేసి ఓడిపోయారు.

 

Leave a Reply