టీడీపీకి మరో నేత గుడ్ బై…బీజేపీలో చేరిక…

tdp mla's condemn the news to spread they are ready to join bjp
Share Icons:

తిరుపతి:

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన ప్రముఖులు కాషాయ కండువా కప్పేసుకున్నారు. అలాగే ఎక్కువ శాతం టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. పైగా సిట్టింగ్‌ ఎంపీలు కూడా కమలం గూటికి చేరిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా.. టీడీపీకి చెందిన ముఖ్యనేత, సివిల్ సప్లై కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈరోజు ఉదయం బీజేపీ జాతీయ నేత రామ్‌మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో బీజీపీ తీర్థం పుచ్చుకున్నారు. సైకంతో పాటు ఐఎంఎ తిరుపతి మాజీ అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి, పలువురు ద్వితియ శ్రేణి నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు.

కాగా.. ఇప్పటికే నాయకుల వీడుతున్న టీడీపీకీ పైకం కూడా టాటా చెప్పేయడంతో పార్టీకి మరో షాక్ తగిలినట్లైంది. త్వరలో మరికొంత మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని సమాచారం.

Leave a Reply