టీడీపీకి మరో స్ట్రాంగ్ లీడర్ గుడ్ బై చెప్పనున్నారా…!

Share Icons:

అమరావతి:

 

ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి దెబ్బలు మీద దెబ్బలు తగులుతున్నాయి.  ఇక టీడీపీ పని ఖతమ్ అని భావిస్తున్న కొందరు నేతలు పార్టీ ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు..మరికొందరు సీనియర్ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలోనే సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఈ క్రమంలోనే టీడీపీలో మంచి వాగ్ధాటి కలిగిన స్ట్రాంగ్ లీడర్ బొండా ఉమా కూడా పార్టీ మరుబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 2014లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఉమా…మొన్నటి ఎన్నికల్లో కేవలం 15 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు గెలిచారు. అటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవడం…విజయవాడ నేతల్లో అంతర్గత విభేదాలు వీటి అన్నిటితో టీడీపీ లో ఉంటె తిప్పలు తప్పవు అని భావిస్తున్న బొండా ఉమా పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

 

బోండా ఉమా ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు . విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు బొండా ఉమా తన శ్రేయోభిలాషులను మరియు అతని అనుయాయులను కలుసుకుని పార్టీ మార్పుపై చర్చించారని తెలుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఆగస్టు 5 న విజయవాడకు తిరిగి వచ్చిన తరువాత బొండా ఉమా జగన్‌ను కలవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం . ఇక జగన్ పార్టీలో చేరటానికి సాధ్యం కాకుంటే బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

 

ఇదిలా ఉంటే తాను  బీజేపీలో చేరడం లేదని టీడీపీలోనే కొనసాగుతానని టీడీపీ నేత డాక్టర్ అరవింద్ బాబు స్పష్టం చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఆదివారం నాడు డాక్టర్ అరవింద్ బాబును కలిశారు. అరవింద్ బాబు ఈ ఎన్నికల్లో  నర్సరావుపేట నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనకు స్నేహితుడని అందుకే తనను కలిశారని అరవింద్ బాబు చెప్పారు. తనకు బీజేపీలో చేరే ఉద్దేశ్యం లేదన్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. తాను పార్టీ మారుతాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Leave a Reply