స్థానిక సంస్థల ఎన్నికల ముందు పవన్‌కు షాక్…సొంత నియోజకవర్గంలోనే

pawan kalyan comments on ap government and ysrcp mla rk counter to pawan
Share Icons:

విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని జనసేన-బీజేపీలు కలిసి మరి పొత్తుగా ఏర్పడి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో పవన్ కు ఊహించని షాక్ తగిలింది. గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం కనకారావు పార్టీని వీడారు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చెయ్యగా పార్టీ కోసం కనకారావు కీలకంగా పని చేశారు . ఇక తాజాగా జనసేన పార్టీని వీడి కారణం కనకారావుతో పాటు 200 మంది జనసేన కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

అంతకముందు గాజువాక నియోజక వర్గంలో కీలకంగా వ్యవహరించిన నేత గాజువాక మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ సీనియర్ నేత చింతలపూడి వెంకట్రామయ్య కూడా ఐదు నెలల క్రితమే జనసేన పార్టీని వీడారు. గత ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుండి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాకలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నియోజకవర్గవలో లక్షకుపైగా సభ్యత్వాలు రావడంలో కీలకపాత్ర పోషించారు. కానీ ఆయన సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు కరణం కనకారావు పార్టీని వీడి వెళ్ళిపోయారు .వైసీపీ లో చేరారు .

అటు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు , సినిమాలు కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీని వీడి వెళ్ళిపోయారు . ఇక తాజాగా పార్టీలో కీలకంగా ఉన్న మరో నేత పార్టీ కి గుడ్ బై చెప్పి పవన్ కు షాక్ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుండటం వల్లే తాను పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కు తగులుతున్న ఈ షాకులు , కీలక నేతలు పార్టీని వీడి బయటకు వెళ్ళటం జనసేనపార్టీకి తీరని నష్టం అని చెప్పొచ్చు

 

Leave a Reply