టీడీపీకి దెబ్బ మీద దెబ్బ…పార్టీకి గుడ్‌బై చెప్పనున్న మరో ఎంపీ…

Share Icons:

విజయవాడ, 14 ఫిబ్రవరి:

గత రెండు రోజులుగా టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న ఎమ్మెల్యే ఆమంచి పార్టీని వీడగా…ఈరోజు ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి మరో ఏమేపీ కూడా గుడ్‌బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అమలాపురం పార్లమెంట్ పరిధిలో తనకు గుర్తింపు లేకుండా టీడీపీ పార్టీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని తాను ఎన్నిసార్లు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం మాత్రం దొరకలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. 

ఇక పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయన ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం నుంచి ఆయన అందుబాటులో లేరని ప్రచారం జరుగుతుంది. 

గురువారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ కు సైతం ఎంపీ అవంతి శ్రీనివాస్ తోపాటు పండుల రవీంద్రబాబు కూడా గైర్హాజరయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు వైసీపీ సైతం గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసీపీ కండువా కప్పుకోనున్నారని ప్రకటించింది. దీంతో ఈరోజే టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.

మామాట: టీడీపీకి గట్టి షాకులే తగులుతున్నాయిగా

Leave a Reply